: చంద్రబాబూ... అరిటాకు, ముల్లు కథ ఆంతర్యమేంటి?... ఉండవల్లి ఘాటు ప్రశ్న!


మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోమారు మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైఖరిపై నిప్పులు చెరిగారు. అరటాకు, ముల్లు కథ ఆంతర్యమేమిటో చెప్పాలని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన అరిటాకు, ముల్లు కథలో... బీజేపీ ముల్లు అయితే, అరిటాకు ఏపీ కాబోదని, ఆ ఆకు చంద్రబాబే అవుతారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడతారో, ద్రోహం చేసి చరిత్రలో నిలిచిపోతారో తేల్చుకోవాలని ఉండవల్లి సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News