: రాజ్ నాథ్ పాక్ పర్యటన నేడే!... సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశానికి హాజరు!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు పాకిస్థాన్ వెళ్లనున్నారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగనున్న సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశం కోసమే ఆయన అక్కడికి వెళుతున్నారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజ్ నాథ్ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని ఇప్పటికే ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాక్ ప్రభుత్వాన్ని కోరాడు. అయితే పాక్ అందుకు సమ్మతించలేదు. ఈ క్రమంలో భారత్ కూడా రాజ్ నాథ్ భద్రతకు సంబంధించిన బాధ్యత మొత్తం పాకిస్థాన్ దేనని కీలక ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ పాక్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.