: 'బుద్ధుందా నీకు?...' అంటూ జగన్ పై విరుచుకుపడ్డ ఆనం వివేకానందరెడ్డి


బుద్ధుందా నీకు?...అంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, రామాయణ కాలంలో మునులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడ్డట్టు...రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాటుపడుతుంటే బంద్ ల పేరుతో జగన్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. జగన్ బంద్ చేయడం వల్ల రాష్ట్రానికి 450 కోట్ల (4 కోట్లని ముఖ్యమంత్రి ప్రకటించారు) రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. బంద్ లు చేయడం వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఆయన తెలిపారు. బంద్ లు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News