: ‘ఎల్లంపల్లి’కి భారీగా వరదనీరు.. ద్వీపాన్ని తలపిస్తున్న గుల్లకోట గ్రామం
ఆదిలాబాద్ జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయంలోకి వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో గుల్లకోట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లక్సెట్టిపేట మండలం ఎల్లంపల్లి ముంపు గ్రామమైన గుల్లకోటను వరదనీరు చుట్టుముట్టడంతో ద్వీపాన్ని తలపిస్తోంది. దీంతో, అప్రమత్తమైన అధికారులు గుల్లకోటలోని కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఈ గ్రామంలో 60 కుటుంబాలు వరదనీటిలో చిక్కుకున్నట్లు గుర్తించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గుల్లకోటలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.