: మోదీ కోసం నాడు అర్ధనగ్నంగా పోజిచ్చి, నేడు ప్రత్యర్థి పార్టీలో చేరుతున్న మోడల్!
గత లోక్ సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీకి మద్దతిస్తున్నానంటూ నాడు అర్ధనగ్నంగా ఫొటోలకు పోజిచ్చిన నటి, మోడల్ మేఘనా పటేల్ పొలిటికల్ కెరీర్ ప్రారంభించనుంది. అయితే, తాను మద్దతిచ్చిన బీజేపీ పార్టీ లో కాకుండా, మహారాష్ట్రలో బీజేపీ ప్రత్యర్థి పార్టీ అయిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ద్వారా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తోంది. ఎన్సీపీలో మేఘనా పటేల్ చేరనున్న విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, వడోదర లో ఈ వారంలో ఒక కార్యక్రమం నిర్వహించనున్నామని, ఆ కార్యక్రమానికి ఆమె హాజరై పార్టీ సభ్యత్వం తీసుకుంటారని చెప్పారు.