: పిల్లలు వేరుశనగ మొక్కలు పీకారని, పెద్దలు ఇనుపరాడ్లతో దాడులు!


అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద మార్టూరులో దారుణం చోటుచేసుకుంది. ఆ గ్రామంలోని మంజునాథ్, సిద్దరాముడుకి చెందిన వ్యవసాయ పొలంలో ఐదుగురు చిన్నపిల్లలు వేరుశనగ మెక్కలు పీకారు. దీంతో వారి పెద్దల మధ్య గొడవ జరిగి, రెండు వర్గాలుగా విడిపోయి, ఇనుపరాడ్లు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఉవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. వేరుశనగ కోసం జరిగిన గొడవలా అనిపించడం లేదని, పాత కక్షలేవో ఉండి ఉంటాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా సంఘటనా స్థలంలో పోలీసులను మోహరించారు.

  • Loading...

More Telugu News