: టాలీవుడ్ లో పెను కలకలం!... సినీ నిర్మాత అచ్చిబాబుపై విశాఖలో జూనియర్ ఆర్టిస్టుల దాడి!


తెలుగు చిత్రసీమ టాలీవుడ్ లో కొద్దిసేపటి క్రితం పెను కలకలం రేగింది. విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తెలుగు సినీ నిర్మాత అచ్చిబాబుపై జూనియర్ ఆర్టిస్టులు దాడికి తెగబడ్డారు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి ఫైటింగ్ సన్నివేశాల్లో నిజమైన ఫైటింగ్ జరిగింది. తాగిన మైకంలో రంగప్రవేశం చేసిన జూనియర్ ఆర్టిస్టులు సదరు చిత్ర నిర్మాత అచ్చిబాబును వ్యాన్ నుంచి కిందకు లాగి ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఈ ఘటనతో మంచు మనోజ్ తో పాటు యూనిట్ మొత్తం షాక్ కు గురైంది. చిత్రం షూటింగ్ లో స్థానికులకు అవకాశం కల్పించలేదన్న కారణంగానే జూనియర్ ఆర్టిస్టులు ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. దాడిలో అచ్చిబాబుకు గాయాలు కాగా, జూనియర్ ఆర్టిస్టులపై యూనిట్ సభ్యులు పరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News