: ఇక జీవితంలో వెంకన్న వేషం వేయను... ఏం తప్పు చేశానంటూ నటుడు సుమన్ నిర్వేదం!
ఇక తన జీవితంలో శ్రీ వెంకటేశ్వరుని పాత్రను పోషించబోనని నటుడు సుమన్ నిర్వేదంతో వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య చిత్రంలో నటించిన తరువాత, ప్రేక్షకులు తనను నిజంగానే వెంకన్న స్వామిలా భావించారని చెప్పిన ఆయన, తాను ఏం తప్పు చేశానని ఆ పాత్రను అవార్డుల సంఘాలు గుర్తించలేదని ప్రశ్నించారు. ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, చిత్రాన్ని చూసి, తనను తీసుకురావాలని అడిగారని, ఆపై తన చేతులు పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లారని గుర్తు చేసుకున్నారు. అన్నమయ్య చిత్రానికి పనిచేసిన వారిలో ఎందరికో అవార్డులు వచ్చాయని, తనలో లోపం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రావాలన్న కోరిక తనకు లేదని, సేవా కార్యక్రమాల్లో మాత్రం ఎప్పుడూ తన వంతు పాత్రను పోషిస్తానని సుమన్ చెప్పారు.