: ప్రభుత్వ నిర్ణయమే ఆలస్యం!... టీ ఎంసెట్-2 లీకేజీపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా!


తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన తెలంగాణ ఎంసెట్- 2 లీకేజీ వ్యవహారంపై నేడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంపై ముందుగా ప్రభుత్వం తన నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాలతో వెంటనే స్పందించిన అడ్వొకేట్ జనరల్... ఎంసెట్- 2 పేపర్ లీక్ అయ్యిందని ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మధ్యాహ్నం కోర్టు ముందు ఉంచుతుందని ఆయన చెప్పారు. దీంతో విచారణను అప్పటికప్పుడు వాయిదా వేసిన ధర్మాసనం... మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపడతామని చెప్పింది.

  • Loading...

More Telugu News