: ‘హోదా’ కోసం టీడీపీ పోరు కంటిన్యూస్!... లోక్ సభలో వాయిదా తీర్మానమిచ్చిన పార్టీ ఎంపీలు!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న మొదలుపెట్టిన పోరుబాటను ఏపీలో అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో బాగస్వామి అయిన టీడీపీ కొనసాగిస్తోంది. నిన్న ఆ పార్టీ ఎంపీలంతా పార్లమెంటు లోపలా, బయటా నిరసనలతో హోరెత్తించారు. సభలోపల ప్లకార్డులు పట్టి టీడీపీ ఎంపీలు చేపట్టిన నిరసన కారణంగా లోక్ సభ ఓ దఫా వాయిదా కూడా పడింది. ‘హోదా’ పోరుబాటలో భాగంగా తాజాగా టీడీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. నేటి సమావేశాల్లో భాగంగా ఏపికి ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలంటూ సదరు వాయిదా తీర్మానంలో టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు.

  • Loading...

More Telugu News