: రెండో విడత ఫ్రీడమ్-251 ఫోన్లు సిద్ధం... 65 వేల లక్కీ కస్టమర్లకు బట్వాడా


రూ. 251కే స్మార్ట్ ఫోన్ లను ఆవిష్కరించి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు, తొలి విడతలో 5 వేల యూనిట్లను పంపిణీ చేసిన రింగింగ్ బెల్స్, రెండో విడత ఫోన్ల బట్వాడాను ప్రారంభించింది. మొత్తం 7 కోట్ల మందికి పైగా ఈ ఫోన్లు కావాలని రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి నుంచి కంప్యూటర్ విధానంలో లక్కీ కస్టమర్లను డ్రా తీశామని, వారికి ఫోన్లను బట్వాడా చేయడం ప్రారంభించామని సంస్థ ప్రకటించింది. మలి విడతలో 65 వేల యూనిట్లను సిద్ధం చేశామని వీటిని మహారాష్ట్ర సహా అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని కస్టమర్లకు పంపించనున్నామని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. కనీసం 2 లక్షల మందికి వీటిని డెలివరీ చేస్తామని అన్నారు. తొలి విడతలో ఫోన్లు అందుకున్న వారి నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. కాగా, రెండు బడ్జెట్ ఫోన్లు, నాలుగు ఫీచర్ ఫోన్లతో పాటు 31.5 అంగుళాల ఎల్ఈడీ టీవీని రూ. 10 వేల కన్నా తక్కువ ధరలోనే రింగింగ్ బెల్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News