: బుధవారం రాజ్యసభలో చర్చకు రానున్న జీఎస్టీ బిల్లు


జీఎస్టీ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జీఎస్టీ బిల్లు చర్చకు వచ్చే సందర్భంగా ఎంపీలంతా సభకు హాజరుకావాలని ఇది వరకే బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లు ఈ నెల 3న (బుధవారం) రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, జీఎస్టీ బిల్లుకు మద్దతిచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ మేరకు విపక్షాలతో జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్న తరుణంలో బిల్లు రాజ్యసభలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News