: ఏపీకి మార్చి 2016 వరకు రూ.6,403 కోట్లు విడుదల చేశాం: రాజ్య‌స‌భ‌లో కేంద్రమంత్రి ప్ర‌క‌ట‌న‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్రం మార్చి 2016 వరకు రూ.6,403 కోట్లు విడుదల చేసిన‌ట్లు కేంద్రమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ రాజ్యసభలో ఈరోజు ప్రకటన చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన ఆర్థిక సాయంపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు ఇంద్ర‌జిత్ సింగ్ లిఖితపూర్వకంగా స‌మాధాన‌మిస్తూ.. తాము విడుద‌ల చేసిన నిధుల్లో రెవెన్యూ లోటు కింద రూ.2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.700 కోట్లు అమ‌రావ‌తికి రూ.2050 కోట్లు, పోలవరానికి రూ.850 కోట్లు ఇచ్చినట్లు ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News