: ‘బాహుబలి’ పార్ట్‌-2 కోసం ఎదురు చూస్తా!: సన్నీ లియోన్


సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్ర‌తి విష‌యాన్ని త‌న అభిమానుల‌తో పంచుకునే బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ 'బాహుబ‌లి' సినిమాని చూసింద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ అమ్మ‌డు తెలిపింది. 'ఎట్టకేలకు బాహుబ‌లిని చూసినట్లు' తన ట్వీట్ లో పేర్కొన్న సన్నీ.. ‘ఈ సినిమా ముగింపు ఎలా ఉంటుందో’న‌ని కూడా పేర్కొంది. ఈ సినిమా పార్ట్‌-2 కోసం ఎదురు చూస్తాన‌ని చెప్పింది. బాహుబ‌లి ది బిగినింగ్ విడుద‌లై ఏడాది అవుతోంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న‌ బాహుబలి- ది కన్‌క్లూజన్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News