: టీడీపీ నాటకాలు కట్టిపెట్టి ఎన్డీఏ నుంచి బయటకు రావాలి!... ట్విట్టర్ లో డిగ్గీరాజా సంచలన కామెంట్స్!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద సాహసమే చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏకంగా రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. అయితే ఆ బిల్లును అడ్డుకోవడంలో బీజేపీ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో నేటి ఉదయం ట్విట్టర్ లో ప్రత్యక్షమైన ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్... ఏపీలో అధికార పార్టీ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఆ నాటకాలన్నింటినీ కట్టిపెట్టి టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని కూడా డిగ్గీరాజా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News