: ఇక పోరుబాటే!... ‘హోదా’ కోసం పార్లమెంటులో నిరసనల హోరు!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో నిన్నటిదాకా చర్చోపచర్చలు జరగగా, ఇకపై నిరసనలు హోరెత్తనున్నాయి. ఈ మేరకు నిన్న విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఆ పార్టీ ఎంపీలు నిరసనలకే ఓటేశారు. రాష్ట్రానికి హోదా దక్కేదాకా పోరు బాట సాగించాల్సిందేనని కూడా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ పోరుబాటులో భాగంగా నేడు పార్లమెంటు ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు నిరసనకు దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లును బీజేపీ సమర్థంగా తిప్పికొట్టిన నేపథ్యంలో ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీ ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News