: 'సరైనోడు' ప్రీ రిలీజ్ వేడుక చిరంజీవిగారి ఆశీర్వాదంతో జరిగింది... సూపర్ హిట్ అయింది...ఈ సినిమా కూడా అంతే!: బోయపాటి శ్రీను


మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో విశాఖపట్నంలో ప్రీరిలీజ్ సక్సెస్ ఫంక్షన్ జరుపుకుని విడుదలైన 'సరైనోడు' సినిమా ఎంత గొప్ప సినిమాగా నిలిచిందో అందరికీ తెలిసిందేనని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపాడు. హైదరాబాదులో 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా వేడుకలో పాల్గొన్న సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ, ఈ సినిమా కూడా ప్రీరిలీజ్ పంక్షన్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో జరుపుకుంటోందని, ఫలితం గురించి కొత్తగా చెప్పక్కర్లేదని అన్నాడు. మంచి సినిమాలు నిర్మాతకు మరింత బలాన్నిస్తాయని, ఈ సినిమా కూడా నిర్మాతకు బలాన్నిస్తుందని భావిస్తున్నానని బోయపాటి తెలిపాడు. టైటిల్ ను బట్టే సినిమా హిట్టా? ఫ్లాపా? అన్నది నిర్ణయమైపోతుందని, ఈ సినిమా టైటిల్ లోనే హిట్ నిర్ణయమైపోయిందని తెలిపాడు.

  • Loading...

More Telugu News