: శిరీష్, లావణ్య అద్భుతంగా నటించారు...మణి వారిని అద్భుతంగా చూపించాడు: పరశురాం


అల్లు శిరీష్, లావణ్య 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలో అద్భుతంగా నటించారని ఈ సినిమా దర్శకుడు పరశురాం తెలిపాడు. ప్రీ రిలీజ్ వేడుకలో పరశురాం మాట్లాడుతూ, సినిమాను అద్భుతమైన ఎంటర్ టైనర్ గా రూపొందించామని అన్నాడు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని, అందర్నీ అలరించే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పాడు. తన చాదస్తాన్ని భరించి మరీ కెమెరామెన్ మణి తనకు కావాల్సిన ఫోటోగ్రఫీ ఇచ్చాడని తెలిపాడు. పేపర్ మీద ఏ ఎమోషన్స్ నైతే తాను రాసుకున్నానో, దానిని నటులు ప్రదర్శిస్తే, వాటిని కెమెరాలో బంధించి అద్భుతంగా చూపించాడని మణి ప్రతిభను పరశురాం ప్రశంసించాడు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తనపై నమ్మకంతో దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన అల్లు అరవింద్ కు ధన్యవాదాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News