: పోలేరమ్మ సాక్షిగా చెబుతున్నా... జగన్ స్కాట్లాండ్ లో ఉన్నప్పుడు నేను లండన్ వెళ్లా: టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
'పోలేరమ్మ సాక్షిగా చెబుతున్నాను... లండన్ లో జగన్ ను నేను కలవలేదు' అని నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తాను లండన్ వెళ్లిన సమయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్కాట్ లాండ్ లో ఉన్నారని అన్నారు. ఇక్కడ మాత్రం తాను లండన్ లో జగన్ ను కలిశానంటూ తన ప్రత్యర్థులు పుకార్లు పుట్టించారని ఆయన చెప్పారు. తానేంటో, తానెలాంటి వ్యక్తినో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ బాబులకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో తన ప్రమేయం లేదని, తనపై ఆరోపణలు ప్రత్యర్థుల కుట్ర అని ఆయన తెలిపారు. తాను చాలా మంచి వ్యక్తినని, పేదల కోసం ఎంతో పాటుపడుతున్నానని ఆయన చెప్పారు. ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేసి మంచి పేరుతెచ్చుకున్నానని ఆయన తెలిపారు.