: ఆరోపణలు చాలా వస్తాయి... నిరూపించాల్సిన బాధ్యత చేసిన వారిదే: డీకే అరుణ
అక్రమ మైనింగ్ చేస్తున్నానంటూ తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కాదని కాంగ్రెస్ నేత డీకే అరుణ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా, తన ఎదుగుదల చూసి ఓర్వలేని వారే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. మైనింగ్ రంగంలోకి తాము కేవలం తొమ్మిదేళ్ల క్రితమే ప్రవేశించామని, అంతకు ముందు నుంచి మైనింగ్ లో సంపాదించిన వారున్నారని, తనపై అవాకులు చవాకులు మాట్లాడడం వల్ల వారికి ప్రచారం వస్తుందని ఆమె చెప్పారు. అక్రమమైనింగ్, లేదా పన్ను ఎగవేత వంటి పనులు చేయలేదని అన్నారు. అలా చేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె చెప్పారు. మైనింగ్ రంగంలో చాలా కాలంగా ఉన్నవారు చేసిన తప్పులను తమపై రుద్దాలని చూస్తున్నారని, వాటిని ఎదుర్కొంటామని ఆమె తెలిపారు.