: రాజీనామాకు సిద్ధమని తెలిపిన అశోక్, సుజనా... వారించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కేటాయించకపోవడం టీడీపీలో పెను కలకలం రేపింది. నేడు జరిగిన టీడీపీ ఉన్నత స్థాయి సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశంలోని పార్టీల నేతలంతా ఏపీకి ప్రత్యేకహోదా కావాలని బలంగా వాదన వినిపించినప్పుడు... మీరెందుకు సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయారని ఆయన ఎంపీలను నిలదీసినట్టు తెలుస్తోంది. దీంతో, మీరు చెబితే రాజీనామా చేసేందుకు సిద్ధమని కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు... తొందరపడవద్దని, ప్రత్యేకహోదాపై ప్రధాని మోదీ స్పందన చూసిన తరువాత నిర్ణయం తీసుకుందామని వారికి సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని ఆయన తెలిపారు.