: రేపు మా ఎంపీలు పార్లమెంటు ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై బీజేపీ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, హోదాపై వ్యతిరేకత ప్రదర్శించాలని భావిస్తే ఢిల్లీ వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు చేయడం వల్ల కేంద్రానికి వచ్చే నష్టమేమీ ఉండదని, అది ప్రజలకే నష్టమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మాత్రం ఎవరూ ఆందోళనలు చేయవద్దని అన్నారు. ఒకవేళ బంద్ చేయాలని బలంగా నిర్ణయించుకుంటే బాగా పని చేసి, ఎక్కువ మొక్కలు నాటి ఆందోళన తెలపాలని చెప్పారు. బ్లాక్ రిబ్బన్ తగిలించుకుంటే ఆందోళన చేసినట్టేనని చంద్రబాబు ప్రజలకు సూచించారు.