: బీజేపీతో కటీఫే మంచిది: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం తన బంధాన్ని తెంచుకుంటేనే పార్టీకి మంచిదని భావిస్తున్నట్టు శాసన మండలి సభ్యుడు బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో నరేంద్ర మోదీ వైఖరిని విమర్శించినందునే, ఇప్పుడు చంద్రబాబు సర్కారుపై కేంద్రంలోని బీజేపీ శీతకన్ను వేసిందని విమర్శించారు. గోద్రాలో అల్లర్లు జరిగిన సమయంలో మోదీ చర్యలను చంద్రబాబునాయుడు తప్పుబట్టారని గుర్తు చేసిన బుద్దా వెంకన్న, నాటి వ్యాఖ్యల పలితంగానే రాష్ట్రం ముందడుగు వేయకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.