: ముఖ్యమంత్రిగా ఉండి మోదీ ధర్నాలు చేయగాలేంది, మీకేంటి?: చంద్రబాబుకు ఉండవల్లి ప్రశ్న


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హితవు పలికారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్ లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కోసం మోదీ, సీఎం హోదాలో ఉండి కూడా స్వయంగా ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం చంద్రబాబు కదలాలని, కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తే మాత్రమే హోదా లభిస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తామన్న విషయాన్ని ప్రభుత్వం తేటతెల్లం చేయాలని, విశాఖపట్నానికి రైల్వే జోన్ విషయంలోనూ చంద్రబాబు గట్టిగా రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేయాలని ఉండవల్లి సూచించారు.

  • Loading...

More Telugu News