: టీడీపీ, బీజేపీ రాజకీయం చేయకుంటే ఏపీకి హోదా ఖాయం: రఘువీరారెడ్డి


తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు రాజకీయాలు చేయకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. కొద్దినేపటి క్రితం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రెండు పార్టీల వైఖరి వల్లే హోదా రాలేదని ఆరోపించారు. ఆగస్టు 5న రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుకు అనుకూలంగా ఓటేసేందుకు 11 పార్టీలను ఒప్పించామని, ఈ పార్టీలన్నీ విప్ ను జారీ చేయనున్నాయని ఆయన తెలిపారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీని కోరామని, ఓటింగ్ కు తమ పార్టీ పట్టుబడుతుందని, బీజేపీ ఓటింగ్ కు అంగీకరించకుంటే, అతి పెద్ద తప్పు చేసినట్టేనని అన్నారు.

  • Loading...

More Telugu News