: ఎంసెట్ లీక్ వెనుక కేటీఆర్ హస్తం: సంచలన ఆరోపణ చేసిన షబ్బీర్ అలీ


తెలంగాణలో ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ వెనుక పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హస్తముందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణ చేశారు. తన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అన్నారు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ల నుంచి, బయో మెట్రిక్ హాజరు నమోదు, ఓఎంఆర్ షీట్ల ముద్రణ తదితర కాంట్రాక్టులను మాగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించిన విషయాన్ని ప్రస్తావించిన షబ్బీర్ అలీ, ఈ సంస్థ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిదేనని అన్నారు. ఈ సంస్థకే అన్ని కాంట్రాక్టులూ ఇవ్వడాన్ని జేఎన్టీయూ సైతం తప్పుపట్టిందని గుర్తు చేసిన షబ్బీర్ అలీ, లీక్ వెనుక కేటీఆర్ ప్రమేయంపై విచారణకు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News