: రాజుగారికి కోపమొస్తే అంతేమరి... కత్తెర ముట్టుకోకుండా, రిబ్బన్ ను చేత్తో లాగేసిన అశోక్ గజపతిరాజు!


తాను ప్రారంభించాల్సిన పాఠశాల తరగతి గదుల ముందు కట్టిన రిబ్బన్ ను కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఆగ్రహంతో చేత్తో లాగేశారు. ఈ ఘటన చీపురుపల్లిలో జరిగింది. దాదాపు రూ. 73 లక్షల సర్వశిక్షా అభియాన్ నిధులతో తరగతి గదుల నిర్మాణం జరుగగా, ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన నిమిషంలోనే కార్యక్రమాన్ని ముగించారు. అక్కడ వాతావరణం పరిశుభ్రంగా లేదంటూ, కత్తెరతో కట్ చేయాల్సిన రిబ్బన్ ను చేత్తో లాగేశారు. అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై బహిరంగ సభ జరుగగా, సెకన్లలోనే తన ప్రసంగాన్ని ముగించి లేచి వెళ్లిపోయారు. ఆయన కోపానికి తోడు, ఆయన ప్రసంగం మొదలుకాగానే, మైకు సరిగ్గా పనిచేయలేదు. కేంద్ర మంత్రి మాటలు ఎవరికీ వినిపించకపోవడంతో, ఓ ఉపాధ్యాయుడు, "సార్ మైకును దగ్గరగా పెట్టుకోండి" అనడంతో ఆయనలో కోపం మరింతగా పెరిగింది. "మీరే మాట్లాడుకోండి" అంటూ అక్కడి నుంచి లేచి వచ్చేశారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, ఎమ్మెల్యే మీసాల గీతలతో పాటు పలువురు అధికారులు, నేతలూ అవాక్కయ్యారు.

  • Loading...

More Telugu News