: మీరు గెలిచి దేశాన్ని గెలిపించండి.. రన్ ఫర్ రియో కార్యక్రమంలో మోదీ


ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ మైదానంలో రన్ ఫర్ రియో కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 20 వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. రియో ఒలింపిక్స్‌కు పెద్ద క్రీడా బృందాన్ని పంపిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో మరింత పెద్ద బృందాన్ని పంపిద్దామన్నారు. క్రీడాకారులు అందరూ విజయం కోసం పోరాడాలని, పతకాలు గెలవాలని ఆకాక్షించారు. మీరు గెలవడం ద్వారా దేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News