: ఒడిశాపై పిడుగుల వర్షం... 40 మంది మృతి
గడచిన 24 గంటల్లో ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి 40 మంది వరకూ మృతి చెందగా, మరో 35 మందికి గాయాలు అయ్యాయి. రాష్ట్రం భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో పిడుగులు పడటం సాధారణమే అయినా, ఈ సంవత్సరం మరిన్ని ఎక్కువ పిడుగులు పడ్డట్టు ఆల్ ఇండియా రేడియో వార్తలు తెలిపాయి. కాగా, పిడుగుల కారణంగా మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ. 50 వేల పరిహారాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. జాతీయ క్రైమ్ రికార్డుల ప్రకారం, 2005 నుంచి పిడుగుల కారణంగా కనీసం 2000 మంది మరణించారని తెలుస్తోంది.