: రోడ్లు ఉన్నది మనుషులు, వాహనాలు వెళ్లడానికి ... విగ్రహాలు కావాలంటే మీ ఇళ్ల దగ్గర పెట్టుకోండి: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లను నిర్మించేది మనుషులు, వాహనాలు వెళ్లడానికని, విగ్రహాలు పెట్టుకునేందుకు కాదని గుర్తించాలని ఆయన సూచించారు. అలా కాకుండా విగ్రహాలు పెట్టాలని ఎవరైనా నిర్ణయించుకుంటే వారివారి నివాసాల ముందు పెట్టుకోవాలని ఆయన సూచించారు. అలా కాకుండా ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News