: ఎంసెట్-2 లీకేజీ కీలక నిందితుడు రాజగోపాల్ రెడ్డి అరెస్టు


తెలంగాణ ఎంసెట్‌-2 లీకేజీ ఘటనలో సీఐడీ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన కీలక నిందితుడు రాజగోపాల్‌ రెడ్డిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఢిల్లీలో రాజేష్‌ అనే మరొక మధ్యవర్తిని కూడా సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఎంసెట్‌-2 లీకేజ్ వ్యవహారంలో ఢిల్లీకి చెందిన ఇక్బాల్‌ అనే నిందితుడు కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో ఎవరినీ వదలొద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో సీఐడీ విచారణను వేగవంతం చేసింది.

  • Loading...

More Telugu News