: మంత్రగత్తె అని దళిత మహిళను దారుణంగా కొట్టి, మూత్రం తాగించారు!
దళితులపై దాడులు పెరుగిపోతున్నాయి. గుజరాత్ లో గోమాంసం తరలిస్తున్నారని ఆరోపిస్తూ దళితులను హింసించిన ఘటన రేపిన కలకలం చల్లారకముందే... మరో దళిత మహిళపై జరిగిన దాష్టీకం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... బీహార్ లోని దర్భంగా జిల్లాలోని పిప్రా గ్రామంలో పలువురు చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో మూఢనమ్మకాలు పెంచుకున్న స్థానికులు చిన్నారుల అనారోగ్యానికి కారణం ఒక దళిత మహిళ అని ఆరోపించారు. దీంతో మంత్రగత్తె అనే నింద వేసి, ఆ మహిళపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఆమెను తీవ్రంగా కొట్టిన ఆ నలుగురూ ఆమెతో బలవంతంగా ఆమె మూత్రాన్ని తాగించారు. దీంతో అవమానం భరించలేని ఆ మహిళ గ్రామం విడిచి వెళ్లిపోయింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.