: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం భారీ వర్షాలు పడ్డాయి. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడ్ ఎర్రగడ్డ, సనత్‌నగర్, ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీంతో స్వల్పంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్లపై నుంచి వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి.