: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన హరీష్ రావు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం కేవలం నాలుగు గంటలపాటు తెలంగాణలో పర్యటించనున్న మోదీ పర్యటనలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 7న ‘మిషన్ భగీరథ’ తొలిదశను మెదక్ జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ వద్ద ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కోమటిబండ వద్ద హెలిప్యాడ్, సభాస్థలి ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీష్ రావు ఏర్పాట్లను పరిశీలించారు.