: భారీ వర్షాలతో త్రిపుర అస్తవ్యస్తం... నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు... లీటర్ పెట్రోలు @300!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు త్రిపుర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. వరదనీరు కట్టలు తెంచుకోవడంతో ఊళ్లకు ఊళ్లు జలమయమయ్యాయి. దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు ట్రాన్స్ పోర్టుకు అవకాశం లేకపోవడంతో ధరల నియంత్రణచర్యలు చేపట్టారు. అయినప్పటికీ అవి ఫలితం ఇవ్వడం లేదు. దీంతో లీటరు పెట్రోలు 300 రూపాయలు, లీటర్ డీజిల్ 150 రూపాయలు పలుకుతున్నాయి. దీనిని సొమ్మచేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. దీంతో పలువురు వ్యాపారులు, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అగర్తలాలో రాష్ట్ర సచివాలయానికి వెళ్లే రహదారులను ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు దిగ్బంధించారు. ప్రజలకు నిత్యావసర సరకులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.