: ఎంసెట్-2ను రద్దు చేయొద్దంటూ తెలంగాణ వ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తల ఆందోళనలు.. ఉద్రిక్తత
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2ను రద్దు చేయొద్దంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు నినాదాలు చేశారు. మరోవైపు, నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారు పోలీసులతో వాగ్వివాదం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.