: విండీస్ యువ బౌలింగ్ అస్త్రాలను సిద్ధం చేస్తోంది.. జాగ్రత్తగా ఆడండి: కోహ్లీ సూచన


టీమిండియా తన పర్యటనలో భాగంగా కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో ఈరోజు రెండో టెస్టులో తలప‌డనుంది. ఈ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌కు బ్యాటింగ్ మెల‌కువ‌ల గురించి సూచ‌న‌లు చేశాడు. బౌన్సీ పిచ్ లపై టాపార్డర్ ఆటగాళ్లకు సూచ‌న‌లు చేస్తూ.. ‘బాధ్యతాయుతంగా ఆడాలి.. మైదానంలో కచ్చితంగా మెరుగైన ఆట‌తీరునే క‌న‌బ‌రుస్తాం.. మైదానంలో ఫాస్ట్ పిచ్ ఎదురుచూస్తోంది. గాయాల‌తో బాధ‌ప‌డుతోన్న‌ మురళీ విజయ్ స్థానంలో జ‌ట్టులోకొచ్చిన‌ లోకేష్ రాహుల్ ప్ర‌స్తుతం మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడిపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది’ అన్నాడు కోహ్లీ. ‘జట్టులో అవ‌స‌ర‌మ‌యినప్పుడు కీపింగ్ బాధ్య‌త‌లు కూడా చేప‌ట్ట‌డం లోకేష్ రాహుల్ మరో ప్లస్ పాయింట్. ఐపీఎల్ లోనూ రాహుల్ మంచి ఆట‌తీరు క‌న‌బ‌రిచాడు’ అని కోహ్లీ ప్రశంసించాడు. రెండో టెస్టులోనైనా గెల‌వాల‌ని వెస్టిండీస్ క‌స‌రత్తు చేస్తోందని అన్నాడు. వెస్టిండీస్ జ‌ట్టులో అల్జారీ జోసెఫ్ (19), మిగుయెల్ కుమిన్స్ తొలి మ్యాచ్ ఆడనున్నారని, ఆ జ‌ట్టులో టాపార్డర్ , పేస్ బౌలర్లు దీటుగా ఆడాల్సిన‌ అవసరం ఉందని కోహ్లీ అన్నాడు. 2008 తర్వాత ఫాస్ట్ పిచ్‌పై ఏ టెస్టు మ్యాచ్ కూడా ఐదు రోజులు పూర్తిగా ఆడ‌లేద‌ని, 2011లో భారత్ కూడా తన మ్యాచ్‌ను 4 రోజుల్లోనే ముగింపజేసి గెలిచింద‌ని కోహ్లీ అన్నాడు. విండీస్ పాస్ట్ పిచ్ లపై యువ బౌలింగ్ అస్త్రాలను సిద్ధం చేస్తోన్న నేప‌థ్యంలో టీమిండియా బ్యాట్స్‌మెన్స్ వాటిని జాగ్రత్తగా, దీటుగా ఎదుర్కునేందుకు సిద్ధం కావాల‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News