: బీజేపీ న్యాయం చేస్తుంది.. రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కృషి చేస్తుంది: పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై భారతీయ జనాతా పార్టీపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఉండబోదని 14వ ఆర్థిక సంఘం ఆనాడే చెప్పిందని ఆమె అన్నారు. అయినా బీజేపీ మన రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం చేయబోదని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతుందని, కచ్చితంగా మాట నిలబెట్టుకుంటుందని ఆమె అన్నారు. రాష్ట్ర విభజనను బీజేపీ చేయలేదని, ఆనాడు సమన్యాయం చేయాలని మాత్రమే బీజేపీ అడిగిందని అన్నారు. రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు బీజేపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.