: తాగునీటి కోసం రోడ్డెక్కిన కన్నడ రైతాంగం!... కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్తత!


కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగు నీటి కోసం కన్నడ రైతులు చేసిన డిమాండ్ మేరకు నీటి విడుదలకు ట్రైబ్యునల్ ససేమిరా అంది. ట్రైబ్యునల్ నిర్ణయానికి నిరసనగా నేటి ఉదయం కర్ణాటక వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కారు. ఆందోళనకు దిగుతున్న రైతుల సంఖ్య నిమిష నిమిషానికి పెరిగిపోతోంది. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకంటూ రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అడ్డుకున్నారు. అయినా రైతులు వెనుకంజ వేయలేదు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దీంతో కర్ణాటక రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News