: పాల వ్యాన్ ఢీకొని బోల్తా పడ్డ కోళ్ల వ్యాన్!... 1,500 కోళ్లను ఫ్రీగా పట్టుకుపోయిన స్థానికులు!


పాల లోడుతో వస్తున్న ఓ వ్యాన్ ను కోళ్ల లోడుతో వస్తున్న మరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోళ్ల వ్యాన్ బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో కోళ్ల వ్యాన్ లో ఉన్న పలువురు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు వారు పరుగులు పెట్టలేడు. బోల్తా పడ్డ వ్యాన్ లోని కోళ్లను తీసుకెళ్లేందుకే వారు అక్కడికి పరుగులు తీశారు. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం అక్కలదీవిగూడెంలో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బోల్తా పడ్డ వ్యాన్ లోని దాదాపు 1,500 కోళ్లను స్థానికులు ఫ్రీగా ఇళ్లకు పట్టుకెళ్లిపోయారు. అయితే వారిలో కొందరు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు కూడా సహకరించారులెండి!

  • Loading...

More Telugu News