: కోహ్లీ బెస్ట్ క్రికెటర్... సచిన్ బెస్ట్ బ్యాట్స్ మన్: బ్రెట్ లీ


టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ క్రికెటర్ కోహ్లీలపై బ్రెట్ లీ అభిమానం కురిపించాడు. సచిన్, కోహ్లీ లిద్దరికీ బౌలింగ్ చేసిన బ్రెట్ లీ ప్రస్తుతం కోహ్లీ ఆటతీరుకు ముగ్ధుడైనట్టు కనిపిస్తోంది. దీంతో తన తాజా సినిమా 'అన్ ఇండియన్' ప్రమోషన్ కోసం ముంబై వచ్చిన సందర్భంగా బ్రెట్ లీ మాట్లాడుతూ, సచిన్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మన్ అని అన్నాడు. కోహ్లీ వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు. తనకు ఇప్పటికీ క్రికెట్ అంటే ఇష్టమని చెప్పిన బ్రెట్ లీ... కోహ్లీ నిబద్ధత, దూకుడుతో ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు. 'అన్ ఇండియన్' రొమాంటిక్ కామెడీ చిత్రమని చెప్పాడు. రెండు విభిన్న సంప్రదాయాలు కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడిన భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించామని బ్రెట్ లీ తెలిపాడు.

  • Loading...

More Telugu News