: ఏపీకి ఇచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టారో చూసిన తరువాతనే మరిన్ని నిధులు!: అరుణ్ జైట్లీ


ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత నవ్యాంధ్ర అభివృద్ధికి కట్టుబడి వున్నామని, ఇప్పటికే ఎన్నో వేల కోట్ల అదనపు నిధులను పోలవరం, రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్రానికి అందించామని వెల్లడించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆ నిధులను ఎలా వెచ్చించారో పరిశీలించిన తరువాతనే మరిన్ని నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. తీసుకున్న డబ్బుకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని అన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ఏపీకి లోటు ఏర్పడితే దాన్ని భర్తీ చేసేందుకు సైతం కట్టుబడి వున్నామని తెలిపారు. రాజధానిలో రాజ్ భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఏర్పాటు నిమిత్తం రూ. 2,500 కోట్లను అందించామని తెలిపారు. ఈ దశలో మంత్రి సుజనా చౌదరి కల్పించుకుని కేంద్రం సాయం చేస్తున్న విషయం నిజమేనని, రాజధాని నిమిత్తం ఇచ్చిన రూ. 2,500 కోట్లలో రూ. 1000 కోట్లను గుంటూరు, విజయవాడల్లో మురుగు నీటి పారుదలకు కేటాయించారని గుర్తు చేశారు. దానిని రాజధానికి ఇచ్చిన నిధులుగా పరిగణించరాదని కోరారు. ఆపై జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఇదే చివరిగా ఇచ్చిన నిధి కాదని, దశలవారీగా ఇస్తున్నామని చెప్పడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా, రాష్ట్రానికి పన్ను రాయితీలు ప్రకటించామని గుర్తు చేశారు. ఈ రాయితీల్లో భాగంగా రాష్ట్రానికి అందిన అదనపు నిధులను సక్రమంగా వెచ్చించాలని సూచించారు.

  • Loading...

More Telugu News