: ‘ట్వీట్’తో విమర్శలు ఎదుర్కున్న సుష్మాస్వరాజ్
నిన్న కోల్‌కతాలో ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవి(90) మృతి చెందిన సంగతి విదితమే. అయితే, మహాశ్వేతాదేవికి నివాళులర్పిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ట్వీట్ కారణంగా ఆమె నెటిజన్లనుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిన్న ఆమె చేసిన ట్వీట్‌లో ‘మహాశ్వేతాదేవి రచించిన ప్రథమ్ ప్రతిశ్రుతి, బకుల్‌కథ పుస్తకాలు నా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి’ అని తెలిపారు. అయితే ప్రథమ్ ప్రతిశ్రుతి, బకుల్‌కథ పుస్తకాలు రాసిన రచయిత్రి మహాశ్వేతాదేవి కాదు. ఆ రెండు పుస్తకాలను రచయిత్రి ఆశాపూర్ణాదేవి రాశారు. సుష్మాస్వరాజ్ ట్వీట్‌ను గమనించిన ఆమె ఫాలోవర్లు ఆమెపై విమర్శల జల్లు కురిపించారు. తప్పుని గ్రహించిన ఆమె ఆ ట్వీట్‌ను డిలేట్ చేశారు. కానీ అప్పటికే ఎంతో మంది నెటిజన్లు ఆ ట్వీట్‌ను షేర్ చేసేశారు.