: బీహార్, యూపీ, ఒడిశాలతో పాటు ఏపీకి ప్రత్యేకహోదా లాంటిది ఇవ్వండి: రాపోలు ఆనందభాస్కర్


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన ద్వారా రెండు రాష్ట్రాలకు మంచి జరిగిందని తెలంగాణ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, విభజన కారణంగా రెండు రాష్ట్రాలు అన్ని రకాలుగా ఎదిగేందుకు పోటీపడుతున్నాయని అన్నారు. అయితే విభజన అనంతరం జరుగుతున్న ఈ చర్చ వల్ల రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఒక విషయం అర్థమైందని ఆయన చెప్పారు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసిందని, ఆఖరుకి విభజన సమయంలో కూడా ఏపీకి న్యాయం జరగలేదని ఆరోపణలు చేసిందని అన్నారు. అయితే ఇప్పుడు అధికారం చేపట్టిన తరువాత బీజేపీ రెండు రాష్ట్రాలకు ఏమీ చేయలేదని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలకు మేలు చేయాలన్న ఆలోచన కూడా ఆ పార్టీకి లేదని తెలుగు ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతారని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఏపీ ఇప్పుడు ఆనందంగా సొంత రాష్ట్రంలో పండగలు చేసుకుంటోందని ఆయన తెలిపారు. బీహార్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేకహోదా లాంటిది ఇస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News