: అశోక్ గజపతిరాజుతో తన కోరికను చెప్పి నెరవేర్చాలని కోరిన కేటీఆర్


ప్రస్తుతం న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్, కొద్దిసేపటి క్రితం పౌర విమానయాన మంత్రి పి అశోక్ గజపతిరాజుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి అమెరికాలోని డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమాన సేవలను ప్రారంభించాలని కోరిన కేటీఆర్, ఈ మేరకు తనవంతు సాయం చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, నిజామాబాద్, కొత్తగూడెంలలో చిన్న విమానాశ్రయాలను గ్రీన్ ఫీల్డ్ పద్ధతిలో నిర్మించాలని కూడా అశోక్ గజపతిరాజును కోరానని, ఆలేరు, కాగజ్ నగర్ లో హెలిపోర్ట్స్ ఏర్పాటు చేయమని సూచించానని వెల్లడించారు. తన విజ్ఞప్తులపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

  • Loading...

More Telugu News