: ఔషధ మొక్కలు నాటిన చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వనం-మనం’ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని సుంకొల్లులో ఏపీ సీఎం చంద్రబాబు ఔషధ మొక్కలైన రావి, వేప నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీలో ఇవాళ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.