: కలాం వేషంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్!
టీడీపీ సీనియర్ నేేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వేషాలేయడంలో ఆరితేరిపోయారు. స్వతహాగా సినిమా నటుడు అయిన శివప్రసాద్ రాజకీయాల్లోనూ విచిత్ర వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తేందుకు గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వేషంలో పార్లమెంటు ఆవరణలో ప్రత్యక్షమైన శివప్రసాద్... రాజ్యాంగాన్ని బీజేపీ సర్కారు అపహాస్యం చేస్తోందని తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. తాజాగా ‘ఒకే రోజు కోటి మొక్కలు’ కార్యక్రమంలో భాగంగా నేటి ఉదయం చిత్తూరులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం వేషంలో దర్శనమిచ్చారు. కలాం వేషధారణలో కార్యక్రమానికి వచ్చిన శివప్రసాద్ అక్కడి స్థానిక నేతలతో కలిసి మొక్కలను నాటారు.