: కడియం, లక్ష్మారెడ్డిల రాజీనామాకు విద్యార్థుల డిమాండ్... మంత్రుల నివాసాల వద్ద ఉద్రిక్తత


తెలంగాణలో ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీకి మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థి సంఘాలు హైదరాబాద్, బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసాల వద్ద నిరసనలకు దిగడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించే ఉద్దేశంతో విద్యార్థులు వస్తున్నారని ముందుగానే పసిగట్టిన పోలీసులు ఈ ప్రాంతంలో బారికేడ్లను ఇనుప కంచెలను సిద్ధం చేసి వారిని అడ్డుకున్నారు. ముట్టడికి తరలివచ్చిన వారిని అరెస్ట్ చేసే క్రమంలో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ లాఠీలకు స్వల్పంగా పనిపెట్టిన భద్రతా దళాలు, వారిని అక్కడి నుంచి చెదరగొట్టాయి. ఈ ఘటనతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీసు వరకూ ట్రాఫిక్ స్తంభించింది.

  • Loading...

More Telugu News