: మమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియదు... పోలీస్ వ్యాన్ లో తిప్పుతున్నారు!: జానారెడ్డి
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ సర్కారు నిర్మించతలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారనున్న వారిని పరామర్శించేందుకు నేటి ఉదయం బయలుదేరిన టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీలను పోలీసులు ఒంటిమామిడి వద్ద అడ్డుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు. అయితే తమను ఎక్కడికి తీసుకువెళుతున్నారో కూడా తెలియడం లేదని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పడానికి నిరాకరిస్తున్న పోలీసులు తమను పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్నారని ఆయన వాపోయారు.