: ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతోన్న ఎంసెట్ ర్యాంకర్లు
ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేసేందుకు తెలంగాణ ఎంసెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. కొద్ది సేపటి క్రితం తెలంగాణ సచివాలయం వద్దకు చేరుకున్న వారితో పోలీసులు వాగ్వివాదానికి దిగి, అక్కడ ఉండొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో కొద్ది సేపు సచివాలయం ముందే విద్యార్థులు బైఠాయించారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపేయడంతో వారు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసనను తెలపాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి ఇందిరాపార్క్‌కు బయలుదేరారు. అయితే, ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో పలువురిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి, గాంధీనగర్ పీఎస్‌కు తరలించారు.